Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aemi Nerambuleka Yaa Maranasthambhamu Ne

ఏమి నేరంబులేక యా మరణస్తంభము నే

Aemi Nerambuleka Yaa Maranasthambhamu Ne

Lyricist: Bethala John
Chorus
ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా
యేసు ఎంత ఘోరము లాయెను ఈ మానవులు యెరుషలేము బైటకు
దీయ నేమి నేరము దోచెను‖ ఏమి ‖
Verse
మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు
వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని
కడగండ్లాయెను‖ ఏమి ‖
Verse
కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు
గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు
చున్నారలీ వేళను‖ ఏమి ‖
Verse
అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి
పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ
కెంత భార మయ్య వెతజూడ జాలను‖ ఏమి ‖
Verse
పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు
పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము
మీ దెల్లనుమిసిరి‖ ఏమి ‖
Verse
కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా
యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ
వెంబడి వత్తురేలను‖ ఏమి ‖
Verse
ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా
యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు
ఏమి నేరంబు లేదుగ‖ ఏమి ‖
Verse
చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా
యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి
రక్తంబు గారెను‖ ఏమి ‖
Verse
నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా
యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు
యూదాళి కగుపడితివి‖ ఏమి ‖
Verse
అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా
యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప
శబ్దముతో బిలిచెద వేమిట్లను‖ ఏమి ‖
Verse
ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా
యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి
ఎంతో వింతై నిలుచును‖ ఏమి ‖
Verse
నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా
యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె
నెంతో చోద్యంబు చూడను‖ ఏమి ‖
Verse
పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను
నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి
చంప నోపితివయ్య ప్రేమను‖ ఏమి ‖
Verse
ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా
యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన
మాకు ఏల కనుపర్చబడ్డది‖ ఏమి ‖
Verse
ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను
నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి
నిన్ను యేమంచు వర్ణింతును‖ ఏమి ‖

Related Tags

Good FridayPassion Of ChristLent