Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aemi Thechchi Ninu Darshimthunayaa

ఏమి తెచ్చి నిను దర్శింతునయా

Aemi Thechchi Ninu Darshimthunayaa

Verse
ఏమి తెచ్చి నిను దర్శింతునయా
ఏ రీతిగా నిను పూజింతునయా
వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
స్తుతియాగము చేతునయా
Verse
వెండి బంగారములు నీవే గదా
కొండపైని పశువులు నీ వశమే గదా
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నీవు కోరిన దూపమాయ‖ ఏమి ‖
Verse
ప్రథమ ఫలములు నీ సేవకీయనా
దహన బలుల నైవేద్యమీయనా
సజీవయాగముగా దేహమర్పించుట
నీదు దృష్టికి యుక్తమయా‖ ఏమి ‖
Verse
మంచి తైలముతో అభిషేకించనా
ఎంచి కానుకలిచ్చి భజయించనా
న్యాయముగా నడచుట కనికరము చూపుట
నీకిష్టమైన యాగమయా‖ ఏమి ‖

Related Tags

WorshipDevotionOffering