Verse 1
నా ప్రాణమా నా జీవమా నా సమస్తమా
నా ఆధారమా నా అభిషేకమా నన్ను మరువకుమా
ప్రభువా.... దేవా......
Verse 2
రక్షింపుము నే రక్షణ పొందెదను - స్వస్థ పరచుము నే స్వస్థత నొందెదను - 2
అధైర్యములో నా ధైర్యము నీవే - ఆపదలో నా ఆశ్రయం నీవే - 2
పడనీయక సిగ్గుపడనీయక - 2
బలపరచి నడిపించుము - స్థిరపరచి నడిపించుము ||ప్రభువా ||
Verse 3
ఉత్సాహధ్వనితో నీ నామము పాడెదను - జీవితమంతా నీ వార్తను చాటెదను - 2
నీ రెక్కల నీడన దాగెదను - నీ అడుగుల జాడల సాగెదను - 2
పడనీయక సిగ్గు పడనీయక - 2
బలపరచి నడిపించుము - నన్ను స్థిరపరచి నడిపించుము ||ప్రభువా ||