Verse 1
ఎవ్వరు నా స్నేహితుడు ఇలలో - ఎవ్వరు నా సన్నిహితుడు యేసు
Verse 2
తోడేలేని గూడబాతులా
పాడైన స్థలములో పగిడి కంటెలా - 2
ఇంటి పైనున్న ఒంటి పిచ్చుకలా - 2
దుఃఖరవములో దీనగువ్వలా - 2
వగచే నన్ను చూచితివి - జాలిగ చేతులు చాచితివి - 2
భయపడకు నీ దేవుడనంటివి - 2
దిగులు పడకు బలపరతునంటివి ||ఎవ్వరు ||
Verse 3
కన్ను గానక నిన్ను ఎరుగక
ఎన్ని దీవెనలనో కోల్పోయితిని - 2
కన్నతండ్రి నీసన్నిధి కొచ్చాను - 2
అన్నియు నీకే అర్పించుకున్నాను - 2
నీవిచ్చిన వాక్యమే నాభాగ్యం
అనునిత్యము అదియే నాధ్యానం - 2
ఎన్నడు చేయిని విడువకుము - 2
నాకున్నది నీవే ఇది నిజము ||ఎవ్వరు ||
Verse 4
గర్వినినేనై సర్వము కోల్పోయి - నిర్వీర్యునిగా నిలిచియుండగా
సర్వము నిచ్చి బ్రోచిన నీవు గాక