Verse 1
చిన్న గొఱ్ఱె పిల్లను - నే నిన్నే పూజిస్తాను
పెద్దైనా నేనెన్నడును - నీ మార్గము తప్పిపోను
తెలిసింది నాకు తెలిసింది - దేవుడనీవని తెలిసింది || చిన్న గొఱ్ఱె పిల్లను ||
Verse 2
చిన్నబ్బాయి రొట్టెలను ఐదువేలకు
ఆహారంగా పెట్టిన వాడవు నీవేగా - నీవేగా
సమాధి నుండి లాజరును - మాటతో బ్రతికించిన
ప్రాణనాధుడవు నీవేగా - నీవేగా ||తెలిసింది ||
Verse 3
చిన్నమ్మాయి మాట విని - నయమానెళ్ళి స్వస్థతనొందె
బాగుచేసినది నీవేగా - నీవేగా చిన్నదానా లెమ్మనగానే - యాయీరు పాప బ్రతికింది
లేపినవాడవు నీవేగా - నీవేగా ||చిన్న గొఱ్ఱె పిల్లను ||