Verse
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు‖ 2x ‖
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు‖ 2x ‖
Verse
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా‖ 2x ‖
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే‖ 2x అగ్ని ‖
Verse
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను‖ 2x ‖
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే‖ 2x అగ్ని ‖
Verse
అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే‖ 2x ‖
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే‖ 2x అగ్ని ‖
Verse
ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా‖ 2x ‖
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా‖ 2x అగ్ని ‖