Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Agni Mandinchu Naalo Agni Mandinchu

అగ్ని మండించు నాలో అగ్ని మండించు

Agni Mandinchu Naalo Agni Mandinchu

Chorus
అగ్ని మండించు నాలో అగ్ని మండించు
పరిశుద్ధాత్ముడా-నాలో అగ్ని మండించు‖ 2x ‖
Verse
అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా
ఆ అగ్నిలోనుండే-నీవు మోషేను దర్శించినావే‖ అగ్ని ‖
Verse
అగ్ని కాల్చివేసెనే-సిద్ధంచేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే-నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే‖ అగ్ని ‖
Verse
అగ్ని కాన రానందునా-వారు సిగ్గుపడి పోయిరే
నీ అగ్ని దిగిరాగా-నీవు ఏలియాను ఘనపరచినావే‖ అగ్ని ‖
Verse
ప్రాణ ఆత్మ శరీరము-నీకే అర్పించుచున్నానయ్యా
నీ ఆత్మ వరములతో- నన్ను అలంకరించు మయ్యా‖ అగ్ని ‖

Related Tags

FireHoly SpiritAnointing