Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ahaaaamthyatheerpu Nanduna

ఆహాఆఅంత్యతీర్పు నందున

Ahaaaamthyatheerpu Nanduna

Chorus
ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే
మహాభయంకరమో ...సింహంబుగా నుండు
Verse
ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?....‖ ఆహా ‖
Verse
లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన
ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును‖ ఆహా ‖
Verse
మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను
ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే‖ ఆహా ‖
Verse
గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి
గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును‖ ఆహా ‖
Verse
నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు
మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి‖ ఆహా ‖
Verse
ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో
ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు‖ ఆహా ‖
Verse
దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును
ఎవ్యాని పేరందుండదో వాడగ్నిలో బడును‖ ఆహా ‖

Related Tags

SalvationJudgmentEnd Times