Chorus
ఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా
ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె
నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే‖ ఐదు ‖
Verse
గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా
యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా‖ ఐదు ‖
Verse
అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ
చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే‖ ఐదు ‖
Verse
ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా
వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద‖ ఐదు ‖
Verse
భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ
సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ‖ ఐదు ‖
Verse
ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ
బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో‖ ఐదు ‖
Verse
తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన
నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే‖ ఐదు ‖
Verse
ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో
హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు‖ ఐదు ‖