Verse
అక్షయ మైనది – యేసుని రక్తము
అమరము నందున – పొందుగ నున్నది
డెందము నందున – ప్రభువును పొందిన
అందలమున ప్రభు మహిమలో నుందుము
Verse
కలిగియుంటిమి – కలుషిత రక్తము
కడతేర్చు చివరకు – క్షయమగు రక్తము
జీవికి రక్తము – మూలాధారము
అక్షయ రక్తమే – నిత్య జీవముకు
Verse
మూడవ దినమున – మరణము గెలిచి
మరియను వారించే – తను తాక వద్దని
మరు క్షణమేగా – పరమును చేరి
మందసమున తన రక్తము నుంచెను
Verse
నిర్మలమైనది – వాడ బారనిది
నిర్దోష మైనది – యేసుని రక్తము
పాప రహితము – పరలోక స్వాస్త్యము
నిత్య జీవముకు – మూలాధారము