Verse
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచిపోవునా‖ 2x ‖
ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే‖ 2x ‖
స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే‖ 2x ‖
Verse
నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే‖ 2x ‖
తరిగిపోను నేను – అణగార్చబడను నేను‖ 2x స్తుతింపజేయునే ‖
Verse
సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే
బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో – అలంకరించునే…
Verse
విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు
ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే‖ 2x ‖
కూలిన కోటను – రాజగృహముగా మార్చును‖ 2x స్తుతింపజేయునే నా మనస్సా ‖