Verse
అలసటపడ్డ నీవు
దేవోక్తి విను
రా, నా యొద్ద, సు విశ్రాంతి
పొందుము
Verse
నేను చూచు గుర్తు లేవి,
వాని కుండునా?
'ప్రక్కఁ గాలుసేతులందు
గాయముల్'
Verse
రాజుఁబోలి కిరీటంబు
వాని కుండునా
'యుండుగాని ముండ్లచేత
నల్లరి'
Verse
నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ
జేర్చుకొనునా?
'ఔను లోకాంతంబు దాఁక
చేర్చును'
Verse
వాని వెంబడింతు నేని
యేమి లాభము?
'పాప దుఃఖ కష్టములు
వచ్చును'
Verse
చావుమట్టు కోర్తునేని
ఏమి యిచ్చును?
'సంతోషంబు సౌఖ్య మింక
మోక్షము'