Chorus
అంబర వీధిలో – సంబరం గాంచిరి
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి‖ 2x ‖
Verse
బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో
పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను‖ 2x ‖
Verse
తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి‖ 2x ‖
Verse
ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము‖ 2x ‖