Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ambaraaniki Antelaa

అంబరానికి అంటేలా

Ambaraaniki Antelaa

Verse
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా‖ 2x ‖
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం‖ 2x ‖
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం‖ 2x లాల ‖
Verse
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు‖ 2x ‖
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే‖ 2x ‖
పశుల పాకలో పరుండియుండెనే‖ లాల ‖
Verse
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని‖ 2x ‖
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు‖ 2x ‖
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి‖ లాల ‖
Verse
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే‖ 2x ‖
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా‖ 2x ‖
సృష్టికి బహు సంబరమాయెగా‖ లాల ‖

Related Tags

PraiseChristmasCelebration