Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ambaraaniki Antelaa (Yesayya Puttaadani)

అంబరానికి అంటేలా (యేసయ్య పుట్టాడని)

Ambaraaniki Antelaa (Yesayya Puttaadani)

Lyricist: A R Stevenson
Verse
అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా‖ 2x ‖
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని‖ 2x ‖
Verse
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి‖ 2x ‖
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే‖ 2x యేసయ్య ‖
Verse
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి‖ 2x ‖
పరముకు నడిపించే
మార్గము చూపించే‖ 2x యేసయ్య ‖
Verse
సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి‖ 2x ‖
ఇలలో నశియించే
జనులను ప్రేమించే‖ 2x యేసయ్య ‖

Related Tags

SalvationChristmasCelebration