Verse
అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు‖ 2x ‖
రండయ్యో రండి రండి దావీదు పురముకు‖ 2x ‖
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు‖ 2x అంబరాన్ని ‖
Verse
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము‖ 2x ‖
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా‖ 2x ‖
అవతరించే నేడు లోక రక్షకునిగా‖ 2x రండయ్యో ‖
Verse
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ‖ 2x ‖
లోకాల కారకుడు లోకమున పుట్టెను‖ 2x ‖
మనిషి మరణము ఆయువు తీరెను‖ 2x రండయ్యో ‖