Verse
అమ్మను మించిన ప్రేమే నీదయ్యా
నిను వర్ణించగా నే సరిపోనయ్య
పాపికి శరణమా ప్రేమకు రూపమా
అక్కున చేర్చిన ఆశ్రయా దుర్గమా
Verse
మంటితో నన్ను మలచినావు
నీదు పోలికలో చేసినావు
ఏదేనులో నను ఉంచావు
ఆదామని నను పిలచినావు
తినవద్దన్నది నే తింటిని
పాపము అన్నదే నే కంటిని
ఎందుకో ఇంత జాలి చూపావు
మాటవినక పాపినైతిన్
ఆ తోట నుండి త్రోయబడితిన్
నీ మధుర సహవాసం కోల్పోయినాను
నిను చేరలేనని నే తలచినను
యేసు అను యాగమే చేసావే
నిన్ను చేరు మార్గమే చేసావే
ప్రేమతో నీ దరి చేర్చావే