Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Amoolya Raktham

అమూల్య రక్తం

Amoolya Raktham

Lyricist: Diyya Prasada Rao
Verse
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం‖ 2x ‖
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము‖ 2x ‖
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే‖ అమూల్య ‖
Verse
తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప‖ 2x ‖
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే‖ 2x యేసు ‖
Verse
శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు‖ 2x ‖
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే‖ 2x యేసు ‖
Verse
నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట‖ 2x ‖
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను‖ 2x యేసు ‖

Related Tags

PraiseBlood Of JesusRedemption