Verse
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
Verse
మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి‖ 2x ‖
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా‖ 2x అమూల్య ‖
Verse
చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము‖ 2x ‖
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి‖ 2x అమూల్య ‖
Verse
నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక‖ 2x ‖
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి‖ 2x అమూల్య ‖
Verse
కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను‖ 2x ‖
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను‖ 2x అమూల్య ‖
Verse
తన రక్త ధారలలో – మన పాపములను కడిగి‖ 2x ‖
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో‖ 2x అమూల్య ‖
Verse
పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ‖ 2x ‖
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము‖ 2x అమూల్య ‖
Verse
మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా‖ 2x ‖
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను‖ 2x అమూల్య ‖