Verse
అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా‖ 2x ‖
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు‖ 2x అమూల్యమైన ‖
Verse
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు‖ 2x ‖
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు‖ 2x అమూల్యమైన ‖
Verse
చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు‖ 2x ‖
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు‖ 2x అమూల్యమైన ‖
Verse
దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు‖ 2x ‖
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు‖ 2x అమూల్యమైన ‖