Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Amoolyarakthamu Dvaaraarakshanapomdhina Janulaaraa

అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా

Amoolyarakthamu Dvaaraarakshanapomdhina Janulaaraa

Verse
అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
Verse
మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి
చెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా
Verse
చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
Verse
నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి
Verse
కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను
Verse
తన రక్తధారలలో - మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో
Verse
పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము
Verse
మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్

Related Tags

WorshipBlood Of JesusSalvation