Verse 1
Reference: నీ వాక్యమే సత్యము యోహాను John 17:17
Verse
మంగళముగ పాడుడీ - కృప సత్యంబును
రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము
విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము
Chorus
అమృతము అద్భుతము దివ్యసత్యము
Verse
సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును
పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము
పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును
Verse
దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును
జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్
యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు
Verse
రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును
ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము
Verse
ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును
పాపికి జీవపానము - దివ్యవాక్యము
పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును
Verse
విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును
నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము
విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము
Verse
హల్లెలూయ పాడెద - కృప సత్యంబును
అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే