Verse
అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే
Verse
నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు
మరణము వరకు మమ్ము నడిపించును
Verse
కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ
ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్
Verse
అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్
Verse
కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును
Verse
ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు
Verse
ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్
Verse
సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు