Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ananda Ganalatho Aradhinchedha Aishwaryavanthuda Yesayya

ఆనంద గానాలతో ఆరాధించెద ఐశ్వర్యవంతుడా యేసయ్య

Ananda Ganalatho Aradhinchedha Aishwaryavanthuda Yesayya

Chorus
ఆనంద గానాలతో ఆరాధించెద ఐశ్వర్యవంతుడా యేసయ్య
అనురాగాలు కురిపించి అనువైన దీవెనలు ఇచ్చావని
ఆనంద నగరములో స్వాస్థ్యము నాకై దాచవని
Verse
అరణ్య ప్రదేశములో నను కనుగొన్నావు
భీకర ధ్వని గల ఎడారిలో నా తోడున్నావు
నన్నావరించి పరామర్శించి కనుపాప వలె కాపాడినావు
నా శైలము నీవై నా దుర్గము నీవై
ఉన్నత స్థలములపై నను నిలిపావు
Verse
నా మనో నేత్రములు వెలిగించియున్నావు
నీ శక్తి యొక్క మహాత్యములు తెలియజేసావు
ఆత్మాభిషేకముతో అభిషేకించి వాక్యోపదేశముతో బలపరిచావు
నా ధ్యానము నీవై నా ఆరాధనా నీవై
నీ పోలికగా నను మలుచుచున్నావు
Verse
నీ జీవ గ్రంధములో నా పేరు రాసావు
నీ పరిశుద్ధలంకారముతో అలంకరించావు
నీ బూర శబ్దమును నే వినగానే నా శరీరము మార్పుచెందును
నా నిరీక్షణ నీవై నా మహిమా నీవై
తేజో వాసులతో నను చేర్చెదవు

Related Tags

PraiseWorshipJesus