Verse
పల్లవి: ఆనంద మానంద మానందమే - ఆనంద మానందమే
Verse
నా ప్రియ యేసు - గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్
Verse
నా ప్రియ యేసు - పాప పడకనుండి నన్ను పైకి లేపెను
Verse
నా ప్రియ యేసు - తన రక్తములో ప్రేమతో నను కడిగెను
Verse
నా ప్రియ యేసు - బాప్తిస్మమున నన్నైక్యపరచెను
Verse
నా ప్రియ యేసు - నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను
Verse
నా ప్రియ యేసు - గొప్ప రక్షణను నిర్లక్షించెదనా?
Verse
నా ప్రియ యేసు - స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను