Chorus
ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు
దాని సుందరము‖ ఆనందమగు ‖
Verse
పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు
చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ
డి పరితృప్తి నుండు‖ నానంద మగు ‖
Verse
బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న
న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల
నమృతుఁడ నెపుడు‖ నానంద మగు ‖
Verse
ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ
ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి
భువి యందె గాంతు‖ నానంద మగు ‖