Chorus
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుషలేము యాత్ర‖ ఆనంద ‖
Verse
యేసుని రక్తము పాపముల నుండి విడిపించును
వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము‖ ఆనంద ‖
Verse
రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ
మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ‖ ఆనంద ‖
Verse
కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము‖ ఆనంద ‖
Verse
ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్‖ ఆనంద ‖