Verse
ఆనందం ఆనందం దినదినం ఆనందం
యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు
స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను‖ 2x ‖
Verse
తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు
దూరంపోయిన కనుగొన్నాడు‖ 2x ‖
తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను‖ ఆనందమే ‖
Verse
ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును
నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును‖ ఆనందమే ‖
Verse
ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో
పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు
అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్‖ ఆనందమే ‖