Chorus
ఆనందం యేసుతో ఆనందం
జయగంభీర ధ్వనితో పాడెదను
జయరాజాధిరాజుతో సాగెదను
Verse
నా ప్రాణమునకు సేదదీర్చి
తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను
ఏ అపాయమునకు నేను భయపడకుందును‖ ఆనందం ‖
Verse
నా ప్రభుని కృప చూచిన
నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా‖ ఆనందం ‖
Verse
సిలువను యేసు సహించెను
తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై
అవమానము నొందె - నాకై మరణము గెలిచె‖ ఆనందం ‖