Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anandamananda Mayenu Naadu Priyakuma

ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమ

Anandamananda Mayenu Naadu Priyakuma

Chorus
ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు‖ మహదానం ‖
Verse
ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు
అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి
నిన్ను అధికంబుగా నభిషేకించెను‖ మహదానం ‖
Verse
అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ
మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా
నియమించెను‖ మహదానం ‖
Verse
తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె
ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో
అతి శ్రేష్ఠుండాయే‖ మహదానం ‖
Verse
నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను
నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి
రండి ధన్యులు కండి‖ మహదానం ‖
Verse
విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ
సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు
విమోచనమాయెను‖ మహదానం ‖
Verse
అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు
నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించును తండ్రి‖ మహదానం ‖
Verse
దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును
మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు
నొందుదురో అందరును పాలించెదరు‖ మహదానం ‖

Related Tags

PraiseWorshipJesus Christ