Chorus
ఆనందమానంద మాయెను - నాదు
ప్రియకుమారుని యందు - మహాదానంద
Verse
నా తనయుని మాట వినండని
శబ్దమొక్కటి యా మేఘములో
ఉద్భవించె నద్భుతముగ
Verse
ప్రేమించుచున్నాను నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు
అందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్ను
అధికంబుగ నభిషేకించెను‖ మహానందమానంద ‖
Verse
అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈ
మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని
వారసునిగా నియమించెను‖ మహానందమానంద ‖
Verse
తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే
మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు
అందరిలో అతి శ్రేష్టుండాయె‖ మహానందమానంద ‖
Verse
నీవు నాదు కుమారుండవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడు
దండిగ తనయుని ముద్దాడెను - నిండుగాయన నాశ్రయించుడి
రండి రండి ధన్యులు కండి‖ మహానందమానంద ‖
Verse
విజ్ఞాన సంపాద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆ
సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు
విమోచన మాయెను యేసు‖ మహానందమానంద ‖
Verse
అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవు
నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించెను తండ్రి‖ మహానందమానంద ‖
Verse
దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహా
అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో
అందరును పాలించెదరు‖ మహానందమానంద ‖