Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anandame Manakilalo Mana Kaanandame Prabhu Lechen

ఆనందమే మనకిలలో మన కానందమే ప్రభు లేచెన్

Anandame Manakilalo Mana Kaanandame Prabhu Lechen

Chorus
ఆనందమే మనకిలలో
మన కానందమే ప్రభు లేచెన్
ఆనందమే మనకిలలో
Verse
పాపుల మిత్రుడు - పాప రహితుడు
పాపులకొరకై - శాప గ్రాహియై
మోపుగ శాపము - వీపున మోసె
పాపపు ఋణము తీర్చె
Verse
పొంతిపిలాతు - మసుఖమునందు
శాస్త్రుల పెద్దల - యేదుటను నిలిచె
స్తోత్రార్హుండు - మరణము గెలిచె
సైతానును ఓడించె
Verse
మరణము భయము - లేని వారమై
మరణమున్ గెల్చిన - యేసుని జేరి
తరుణమును - పోగొట్టుకొనక
పరమ ప్రభువును చాటన్
Verse
లేచిన ప్రభువు - ప్రియులను జూచి
గాంచెద నంచు - అభయమునిచ్చె
తీసివేసెను - చింతయు నంతను
రోసెద మిపుడే లోకమున్
Verse
పరమునకేగి - పంపెనాత్మను
పరవశులైరి - శిష్యులు గదిలో
కొరతలేని - శక్తిని పొందిరి
శిరముల - నెత్తిచాటిరి
Verse
మన ప్రభుయేసు - వచ్చుచుండె
మనము - రెప్ప - పాటున మారి
తనివి దీరగా - సంతసించి
వినయుని చేరెదము
Verse
మహిమ కిరీట - ధారులమై
మహిమ వస్త్రములు ధరించి
మహిమగల - రాజుతో నుండి
మహిని పాలించెదము

Related Tags

PraiseResurrectionEaster