Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anandhamutho Aaradhinthun Aathmathonu Sathyamutho

ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో

Anandhamutho Aaradhinthun Aathmathonu Sathyamutho

Verse
ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో
Verse
రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును
Verse
పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను
Verse
మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను
Verse
శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను
Verse
పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను
Verse
శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు
Verse
అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ

Related Tags

PraiseWorship