Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anandhinchedamu Yehovalo Athishayinchunu Maadhu Aathma

ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ

Anandhinchedamu Yehovalo Athishayinchunu Maadhu Aathma

Chorus
ఆనందించెదము యెహోవాలో
అతిశయించును మాదు ఆత్మ
రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము
నీతి వస్త్రమున్ ధరింప జేసె
Verse
పరదేశులు మమ్ము ప్రభువా దేవా
నీదు యాజక సేవకులనెదరు
జగమున జనముల భాగ్యంబిచ్చి
ప్రభవింతు రంటివి ప్రభావముతో
Verse
అన్యులు చేసిన అవమానమునకు
ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను
నిందకు ప్రతిగా పొందిన భాగము
అనుభవించుచు హర్షింతు రంటివి
Verse
వారు తమదు దేశమునందు
రెట్టింపు భాగమునకు కర్తలౌదురు
నిత్యానందము వారికి కలుగును
ఎన్నడు వారిని విడువ నంటివి
Verse
న్యాయము చేయుట నాకెంతో ప్రీతి
అన్యాయపు సొత్తు నా కసహ్యము
సత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచు
నిత్య నిబంధన చేసెదనంటివి
Verse
జనములకు వారి సంతతి తెలియును
జనముల మధ్యను ప్రసిద్ధి నొందును
యెహోవా ఆశీర్వదించిన జనమని
ఒప్పుకొందురు చూచినవారు
Verse
భూమి మొలకను మొలిపించినట్లుగా
తోటలో మొలిచిన విత్తనమువలె
జనముల యెదుట ప్రభు యెహోవా
నీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును
Verse
క్రీస్తునందు మాకిచ్చినయట్టి
ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై
సర్వోన్నతుడా సన్నుతించుచు
హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము

Related Tags

PraiseWorshipJoy