Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anandhinchedhamu Prabhu Yesulo Anthayu Maralaarjinchu Kontimi

ఆనందించెదము ప్రభు యేసులో అంతయు మరలార్జించు కొంటిమి

Anandhinchedhamu Prabhu Yesulo Anthayu Maralaarjinchu Kontimi

Verse 1
Reference: దావీదు సమస్తమును రక్షించెను 1 సమూయేలు Samuel 30:19
Verse
ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలార్జించు కొంటిమి
ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు
Chorus
నష్టము నంతటిని మరల - మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము
Verse
దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి
Verse
పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు
మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత
Verse
మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను
Verse
దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి
పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి
Verse
నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి
ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను
Verse
పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి
శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల

Related Tags

PraiseVictoryRestoration