Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaala Baaludu Udayinchinaadu

అందాల బాలుడు ఉదయించినాడు

Andaala Baaludu Udayinchinaadu

Lyricist: Sayaram Gattu
Verse
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు‖ 2x ‖
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను‖ 2x అందాల ‖
Verse
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి‖ 2x ‖
గొల్లలము మేము కల్లలు ఎరుగము‖ 2x ‖
కళ్లారా జూసాము తేజోమయుని మోము‖ 2x రండయ్యో ‖
Verse
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము‖ 2x ‖
దారి చూపే తార రారాజునే జేర‖ 2x ‖
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా‖ 2x రండయ్యో ‖
Verse
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు‖ 2x ‖
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు‖ 2x ‖
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు‖ 2x రండయ్యో ‖

Related Tags

Christmas