Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaala Thaara

అందాలతార

Andaala Thaara

Lyricist: A B Masilamani
Verse
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని‖ అందాల తార ‖
Verse
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్‖ అందాల తార ‖
Verse
యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి
యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో
ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు‖ అందాల తార ‖
Verse
ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలుని జూడ జీవితమంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన‖ అందాల తార ‖

Related Tags

WorshipChristmas