Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaala Udyaanavanamaa

అందాల ఉద్యానవనమా

Andaala Udyaanavanamaa

Verse
అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా‖ 2x ‖
పుష్పించలేక ఫలియింపలేక‖ 2x ‖
మోడై మిగిలావ నీవు‖ 2x అందాల ‖
Verse
ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా‖ 2x ‖
కాచావు నీవు కారు ద్రాక్షాలు‖ 2x ‖
యోచించు ఇది న్యాయమేనా‖ 2x అందాల ‖
Verse
ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా‖ 2x ‖
పెరిగావు నీవు ఫలియింపలేక‖ 2x ‖
యోచించు ఇది న్యాయమేనా‖ 2x అందాల ‖
Verse
ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు‖ 2x ‖
ఇకనైన నీవు నిజమైన ఫలముల్‖ 2x ‖
ప్రభు కొరకై ఫలియింపలేవా‖ 2x అందాల ‖

Related Tags

RepentanceEncouragementChristian Life