Verse
అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా‖ 2x ‖
పుష్పించలేక ఫలియింపలేక‖ 2x ‖
మోడి మిగిలావ నీవు‖ 2x అందాల ‖
Verse
ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా‖ 2x ‖
కాచావు నీవు కారు ద్రాక్షలు‖ 2x ‖
యోచించు ఇది న్యాయమేనా‖ 2x అందాల ‖
Verse
ప్రభు యేసులో నీవు నిలిచి
పరిశుద్దాత్మతో నీవు పయనించుమా‖ 2x ‖
పెరిగావు నీవు ఫలియింపలేక‖ 2x ‖
యోచించు ఇది న్యాయమేనా‖ 2x అందాల ‖
Verse
ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు‖ 2x ‖
ఇకనైనా నీవు నిజమైన ఫలముల్‖ 2x ‖
ప్రభు కొరకై ఫలియింపలేవా‖ 2x అందాల ‖