Verse
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ‖ 2x ‖
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే‖ 2x అందాలు ‖
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా‖ 2x ‖
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం‖ 2x అందాలు ‖
సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం‖ 2x ‖
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం‖ 2x అందాలు ‖
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత‖ 2x ‖
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో‖ 2x అందాలు ‖