Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaramu Prabhu Ninnu Koniyaadedamu Mahathmundavu Parishuddhudavu

అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముండవు పరిశుద్ధుడవు

Andaramu Prabhu Ninnu Koniyaadedamu Mahathmundavu Parishuddhudavu

Verse
అందరము ప్రభు నిన్ను కొనియాడెదము
మహాత్ముండవు పరిశుద్ధుడవు
బలియైతివి లోకమును రక్షించుటకు
Verse
అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో
సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది
సర్వలోకము నీదు వశమందున్నది
Verse
గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా
అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు
శత్రువులను అణచునట్టి విజయశాలివి
Verse
బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి
నీదు మార్గములు యెంతో అగమ్యంబులు
కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు
Verse
కృపాళుండవైన యేసు దయగల దేవా
దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు
వేల వేల తరములలో కృపను జూపెదవు
Verse
క్షమించెదవు మానవుల పాపములెల్ల
విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు
పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా

Related Tags

PraiseWorshipRevelation