Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaru Mechchina Andaala Thaara

అందరు మెచ్చిన అందాల తార

Andaru Mechchina Andaala Thaara

Lyricist: G Purushotham Babu
Verse
అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ‖ 2x ‖
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్‖ 2x అందరు ‖
Verse
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు‖ 2x ‖
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు‖ 2x ‖
నీకై రక్షణ తెచ్చినాడు‖ క్రిస్మస్ ‖
Verse
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు‖ 2x ‖
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు‖ 2x ‖
ఎన్నో వరములు ఇచ్చినాడు‖ క్రిస్మస్ ‖
Verse
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు‖ 2x ‖
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే‖ 2x ‖
హృదయమునందు హాయి నేడు‖ క్రిస్మస్ ‖

Related Tags

Christmas