Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andhakaara Cherasaalalo Bandhakaala Irukulo

అంధకార చెరసాలలో బంధకాల ఇరుకులో

Andhakaara Cherasaalalo Bandhakaala Irukulo

Verse
అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి –‖ 2x ‖
భూమియే కంపించెను – చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను –‖ 2x ‖
Verse
వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా
రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని
మన దాగుస్థలములో – యేసుని సన్నిధిలో‖ అంధకార ‖
Verse
ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో
ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై
యేసుని వేడెదము – శోకము తొలగించమని‖ అంధకార ‖
Verse
మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో‖ అంధకార ‖

Related Tags

WorshipPrayerDeliverance