Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andhamaina Kreesthu Katha Mee Raalimparaya

అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ

Andhamaina Kreesthu Katha Mee Raalimparaya

Lyricist: Purushothamu Choudari
Chorus
అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య‖ అందమైన ‖
Verse
పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ
వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి
రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు
సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని
మనుజ నందనుని నడిగిరప్పు‖ అందమైన ‖
Verse
చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ
జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు
మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం
దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని
తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె‖ అందమైన ‖
Verse
బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో
బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని
పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్
ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి
నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని‖ అందమైన ‖
Verse
చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార
మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు
లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ
బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు
లోపలి చూపుఁ జూచి యానందింత‖ అందమైన ‖

Related Tags

HealingJesus