Verse
అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
యేసు రాకడకు సమయం అయ్యుందని
సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని
Pre-Chorus
వాయుదా వెయ్యకుండా - కారణాలు చెప్పకుండా
రక్షణ పొందుకోమని
Verse
యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూ
ఆకాశానికెత్తబడి
ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని
Verse
యేసయ్యను అంగీకరించక త్రోసివేసినవారందరూ
భూమి పై విడువబడి
ఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని