Chorus
అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...
Verse
నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె
ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...‖ అ ‖
Verse
మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ
మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి
జయధ్వనులిడిరె‖ అ ‖
Verse
ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా
ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా
Verse
లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని
జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని
Verse
పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు
నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని
కరుణ యిదే‖ అ ‖
Verse
హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు
చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము‖ అ ‖