Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anjali Ghatiyinthu Deva

అంజలి ఘటియింతు దేవా

Anjali Ghatiyinthu Deva

Chorus
అంజలి ఘటియింతు దేవా‖ 2x ‖
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి‖ అంజలి ‖
Verse
పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ‖ 2x ‖
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా‖ 2x ‖
దేవా దేవా యేసు దేవా‖ 2x ‖
అంజలి ఘటియింతు దేవా‖ అంజలి ‖
Verse
అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ‖ 2x ‖
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా‖ 2x ‖
దేవా దేవా యేసు దేవా‖ 2x ‖
అంజలి ఘటియింతు దేవా‖ అంజలి ‖

Related Tags

WorshipDevotional