Verse
అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా‖ 2x ‖
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా‖ 2x ‖
Verse
మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు‖ 2x ‖
అంగీకరించుము నా సమర్పణ‖ అంకితం ‖
Verse
కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు‖ 2x ‖
అంగీకరించుము నా సమర్పణ‖ అంకితం ‖