Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ankitham Prabhu Naa Jeevitham Nee Charanaala Sevake Ankithamayya

అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా

Ankitham Prabhu Naa Jeevitham Nee Charanaala Sevake Ankithamayya

Chorus
అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా‖ 2x ‖
నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా‖ 2x ‖
Verse
మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు‖ 2x ‖
అంగీకరించుము నా సమర్పణ
Verse
కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు‖ 2x ‖
అంగీకరించుము నా సమర్పణ

Related Tags

SurrenderDedicationService