Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anna Mana Yesu Prabhuni Kanna Rak

అన్నా మన యేసు ప్రభుని కన్న రక్

Anna Mana Yesu Prabhuni Kanna Rak

Lyricist: Ravuri Lakshmayya
Verse
అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన
యఘము లన్ని సడలించి ప్రోచు‖ నన్న ‖
Verse
మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన
దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై‖ నన్న ‖
Verse
నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు
అతని పాద రజయుగ్మును స్మరించు‖ మన్న ‖
Verse
దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం
పెక్కి వర్తించె నహహ‖ యన్న ‖
Verse
ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది
జాలంబులఁ గడఁ ద్రోయును‖ అన్న ‖
Verse
మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది
నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు‖ నన్న ‖

Related Tags

WorshipSalvationJesus